
ఉద్యోగుల సంక్షేమానికి కృషి
● బొగ్గు ఉత్పత్తిని పెంచాలి ● సింగరేణి డైరెక్టర్(పీపీ) కే.వెంకటేశ్వర్లు
శ్రీరాంపూర్: ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ ఎల్లవేళలా కృషి చేస్తుందని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కే.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన శిశు సంరక్షణ కేంద్రం, నస్పూర్ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన గోదావరి ఫంక్షన్ హాల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి పెంచాలని, ఓపెన్‌కాస్టు గనుల్లో ఓబీ లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు. నిర్ధేశించిన ఓబిని తీస్తేనే బొగ్గు వెలికితీయవచ్చని, ఉత్పత్తితోపాటు రవాణా కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో శ్రీరాంపూర్ జీఎం ఎం.శ్రీనివాస్, ఎస్‌ఓటు డైరెక్టర్ మెహతా, ఏరియా ఎస్‌ఓటు జీఎం సత్యనారాయణ, ఏజీఎం(ఫైనాన్స్) బీభత్సా, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీసైదా, వర్క్‌షాప్ డీజీఎం రవీందర్, సివిల్ డీజీఎం ఆనంద్‌కుమార్, గుర్తింపు సంఘం నాయకుడు ముస్కే సమ్మయ్య, ఎం.కొమురయ్య, కొట్టే కిషన్‌రావు, ఫిట్ సెక్రెటరీ సందీప్, తదితరులు పాల్గొన్నారు.