
సాగులో ఉన్న రైతులకు పట్టాలివ్వాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్
చెన్నూర్: కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామంలో 70ఏళ్లుగా సాగులో ఉన్న రైతులకే పట్టాలివ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. బీజేపీ నాయకులు సర్వాయిపేట గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. శనివారం చెన్నూర్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 మంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు సేత్వార్ ద్వారా పట్టా చేయించుకున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రి, అధికారులు సర్వాయిపేట భూములపై మోకా సర్వే నిర్వహించి న్యాయబద్ధంగా సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పట్టణ అధ్యక్షుడు తుమ్మ శ్రీపాల్, కోటపల్లి మండల నాయకులు పెద్దింటి పున్నంచంద్, మంత్రి రామయ్య, కాశెట్టి నాగేశ్వర్‌రావు, కందుల వెంకటేశ్, జాడి తిరుపతి, కమ్మల శ్రీనివాస్, వెంకటనర్సయ్య పాల్గొన్నారు.