
చట్టాలపై అవగాహనకు సదస్సులు
భీమారం: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకే న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పర్వతనేని రవి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. చట్టాలపై తెలుసుకుంటే ఎలాంటి నేరాలకు ఎలాంటి శిక్ష ఉంటుందనే విషయం తెలుస్తుందన్నారు. న్యాయశాఖ ద్వారా ప్రజలతోపాటు విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సై శ్వేత, ఎంపీవో సతీష్‌రెడ్డి, న్యాయవాదులు రాజ్‌కుమార్, రాజేష్ , పున్నం, లక్ష్మణ్ పాల్గొన్నారు.