గిరి గూడేలకు పండుగ శోభ | - | Sakshi
Sakshi News home page

గిరి గూడేలకు పండుగ శోభ

Jul 20 2025 5:55 AM | Updated on Jul 20 2025 2:31 PM

గిరి

గిరి గూడేలకు పండుగ శోభ

ఆకిపేన్‌..
● ఆదివాసీ సంస్కృతి.. సంప్రదాయాల సౌరభం ● నాలుగు మాసాలు వివిధ పండుగలు ● అకాడితో ప్రారంభమై దీపావళితో ముగింపు ● కుల దేవతలకు ప్రత్యేక పూజలు ● ఆదివాసీ పల్లెల్లో కోలాహలం

‘శీత్ల’ పండుగ

శీత్ల భవాని లంబాడీల దేవత. పశువుల ఆరోగ్యం, తండా సౌభాగ్యం కోసం శీత్ల భవానికి పూజలు చేయడం లంబాడీల ఆనవాయితీ. కలరా వంటి వ్యాధుల బారి నుంచి కాపాడుతుందని వారి నమ్మకం. ఆషాఢమాసంలో ఒక మంగళవారం గ్రామ సరిహద్దులోని పొలిమేరలో ఉన్న కూడలి వద్ద శీత్ల భవానీని ప్రతిష్టిస్తారు. మహిళలు, యువతులు నెత్తిన బోనం ఎత్తుకుని వస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పిస్తారు. కోళ్లు, మేకలను బలిచ్చి వాటిపైనుంచి పశువులను దాటిస్తారు. పశు సంపద వృద్ధి చెందాలని, పాడిపంటలు బాగా పండాలని, ఎలాంటి దుష్టశక్తులు దరి చేరకుండా ఉండాలని శీత్ల మాతను పూజిస్తారు.

విజ్జపేన్‌..!

పెర్సాపేన్‌, రాజుల్‌దేవత వద్దకు విత్తనాలను తీసుకెళ్లి పూజలు చేస్తారు. పంటలకు ఎలాంటి హాని కలగకుండా చూడాలని పెర్సాపేన్‌కు మొక్కుతారు. అంతకు ముందు గ్రామంలో ఉన్న విత్తనాలను ఒక వద్దకు చేర్చి కుల దేవతలకు అందరు కలిసి పూజలు నిర్వహిస్తారు. అనంతరం కటోడా వాటిని అందరికీ అందిస్తారు. ఆ తర్వాతే పొలం పనులు ప్రారంభిస్తారు.

అడవిలో ఆకులు చిగురించి పచ్చగా మా రుతున్న క్రమంలో ఆదివాసీలు ఆకిపేన్‌ కు పూజలు చేస్తారు. ఈ కాలంలో అడవికి వెళ్లిన మూగజీవాలకు రక్షణగా ఉండాలని, ఎలాంటి హాని తలపెట్టవద్దని, పంటలు అధికదిగుబడి సాధించాలని పూజలు చేస్తారు. ఈ సందర్భంగా లక్ష్మణరేఖ లాంటి గీతను గీస్తారు. ప్రత్యేకంగా తయారు చేసిన తుర్రను ఊదడంతో పశువులు అడవిలోకి పరుగెత్తాయి. కోడి, మేకలతో జాతకం చెబుతారు.

ప్రతీ పండుగకు ప్రత్యేకత

ఆదివాసీలు జరుపుకునే ప్రతీ పండుగకు ప్రత్యేకత ఉంది. అకాడి నుంచి ప్రారంభమైన పండుగలు నాలుగు మాసాలపాటు కొనసాగుతాయి. దీపావళికి గుస్సాడీ దీక్ష స్వీకరించే వారు ఇప్పుడే కుల దేవతలకు మొక్కుకుంటారు. కార్యం నెరవేరాక దీక్ష చేపడతారు. పూజల తర్వాత ఏత్మాసార్‌ పేన్‌కు పూజలు చేస్తాం. వన భోజనం ఐకమత్యాన్ని తెలియజేస్తుంది.

– కుర్సెంగ దుందేరావు, ఆదివాసీ

నాయకుడు, చౌపన్‌గూడ

కెరమెరి(ఆసిఫాబాద్‌): మారుతున్న ఆధునిక కా లంలోనూ ఆదివాసీలు తమ ఆచారాలు, సంప్రదాయాలు కొనసాగిస్తున్నారు. సమాజంలో ఎ న్నో మార్పులు వస్తున్నప్పటికీ ఆదివాసీలు నేటికీ పుడమితల్లిని పూజిస్తూ కాలం వెల్లదీస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, సంస్కృతి, ఆచార వ్యవహారాల్లోనూ.. తమకు మరెవరూ సాటిరారని నిరూపిస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆదివాసీలు. వారి ఇళ్లల్లో జరిగే వివాహాల్లో వైవిధ్యం ఉంటుంది. నూతనత్వం కనిపిస్తుంది. పండుగల్లోనూ కొత్తదనం కనిపిస్తుంది. ఆషాఢమాసంలో వచ్చే అకాడి పండుగతో ప్రారంభమయ్యే ఆదివాసీల పండుగలు, ఉత్సవాలు దీపావళితో ముగుస్తాయి. నాలుగు మాసాల పాటు ఆదివాసీ గూడేల్లో వివిధ రకాల పండుగలు సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీలు అకాడి పండుగలో జరిపే ఇతివృత్తంపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం..

అకాడి..

ఆషాఢమాసంలో ప్రథమంగా వచ్చే పండుగ అకాడి. పాడిపంటలకు రక్షణ కల్పించే అడవిదేవతగా భావించే రాజుల్‌పేన్‌ను పూజిస్తారు. నెలవంక కనిపించగానే జిల్లాలోని ప్రతీ గ్రామంలో దీనిని నిర్వహిస్తారు. అకాడి పండగను కొందరు పౌర్ణమి వరకు నిర్వహిస్తే మరికొందరు అమావాస్య వరకు నిర్వహిస్తారు. అనాదిగా వస్తున్న ఆచారమని ఆదివాసీ పెద్దలు, కటోడాలు పేర్కొంటున్నారు.

గిరి గూడేలకు పండుగ శోభ1
1/3

గిరి గూడేలకు పండుగ శోభ

గిరి గూడేలకు పండుగ శోభ2
2/3

గిరి గూడేలకు పండుగ శోభ

గిరి గూడేలకు పండుగ శోభ3
3/3

గిరి గూడేలకు పండుగ శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement