
విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య, వైద్యం అందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఉమ్మడి జిల్లా ఆశ్రమ పాఠశాలల డీటీడీవో, ఏటీడీవోలు, ఏఎన్‌ఎంలను ఆదేశించారు. శనివారం కేబీ కాంప్లెక్స్‌లోని సమావేశ మందిరంలో ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. మోవా లడ్డూ, విటమిన్ ‘సి’ పాలిక్ యాసిడ్ వంటి మాత్రలను వారంలో రెండుసార్లు మధ్యాహ్న భోజనం తర్వాత ఇవ్వాలని సూచించారు. స్నానానికి వేడి నీళ్లు ఉండేలా చూడాలన్నారు. ప్రతీరోజు విద్యార్థుల హిమోగ్లోబిన్ శాతం పరిశీలించాలని ఏఎన్‌ఎంలను ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్లు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ అంబాజీ, ఏడీఎంహెచ్‌వో కుడిమెత మనోహర్, తదితరులు పాల్గొన్నారు.