
అదనపు కలెక్టర్ చంద్రయ్య బాధ్యతల స్వీకరణ
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా పి.చంద్రయ్య గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ కుమార్ దీపక్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. చంద్రయ్యను జిల్లా పౌరసంబంధాల అధికారి ఎం.కృష్ణమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు.
టీఎన్జీవోస్ సభ్యుల సన్మానం
మంచిర్యాలటౌన్: జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) పి.చంద్రయ్యను గురువారం టీఎన్జీవోస్ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, జిల్లా ఉపాధ్యక్షుడు రామ్‌కుమార్, తిరుపతి, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాల్, అజయ్, సూపరింటెండెంట్ వసంతకుమార్, గంగారం, కార్తీక్, అజయ్, వెంకటస్వామి పాల్గొన్నారు.