
న్యాయసేవలపై అవగాహన పెంచుకోవాలి
బెల్లంపల్లి: న్యాయ సేవలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె.ముఖేష్ అన్నారు. గురువారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయ చైతన్యం, ఉచిత న్యాయసేవల ప్రాముఖ్యత తదితర అంశాలు వివరించారు. అంతకుముందు కళాశాల ఆవరణలోని మూడు వసతిగృహాలు, వసతి గదులు పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు జడ్జిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎం.దేవేందర్, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.