
108లో సుఖప్రసవం
కోటపల్లి: మండలంలోని పంగిడిసోమారం గ్రామానికి చెందిన గర్భిణి రెడ్డి లవలోకకు గురువారం పురిటినొప్పులు రావడంతో ఆమె భర్త అర్జన్న 108కి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అంబులెన్సులో కోటపల్లి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పురిటినొప్పులు అధికం కావడంతో పంగిడిసోమారం అటవీప్రాంతంలోనే సుఖప్రసవం చేయడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇరువురిని కోటపల్లి పీహెచ్‌సీకి తరలించారు. కార్యక్రమంలో ఈఎంటీ షబనాజ్, ఫైలట్ ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.