
గిరిజన విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేత
ఉట్నూర్‌రూరల్: కెరమెరి మండలంలోని నిషాని గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి ఆత్రం వంశీకృష్ణ పైచదువుల నిమిత్తం గురువారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తన కార్యాలయంలో ల్యాప్‌టాప్ అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివితే భవిష్యత్‌లో అపజయాలు ఉండవని, ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.
సన్మానం
కళామందిర్ ఫౌండేషన్ ద్వారా ఇటీవల సేవారత్న పురస్కారం అందుకున్న కాథ్లే మారుతిని గురువా రం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సన్మానించారు. ఆ దిలాబాద్ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన మారుతి ఎంతోమంది గిరిజన విద్యార్థులకు వి లువిద్యలో శిక్షణ ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. ఫౌండేషన్ తరపున అతనికి రూ.లక్ష నగదు, జ్ఞాపిక అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీవో పీవీటీజీ మెస్రం మనోహర్, ఏసీఎంవో జగన్, జిల్లా క్రీడల అధికారి పార్థసారథి పాల్గొన్నారు.