రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్‌

Jul 17 2025 3:40 AM | Updated on Jul 17 2025 3:40 AM

రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్‌

రోడ్డు కబ్జా చేసిన ఇద్దరి రిమాండ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: నకిలీ పత్రాలు సృష్టించి రోడ్డును కబ్జా చేసిన ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌రెడ్డి తెలిపారు. బుధవారం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌కు చెందిన రంగినేని శ్రీనివాస్‌ శాంతినగర్‌లోని మున్సిపల్‌ రోడ్డుకు తన బావ అమూల్‌ పేరిట డోర్‌ నంబర్‌ తీసుకొని ఇంటి పన్నులు చెల్లించాడు. ఆ తర్వాత అమూల్‌ తన భార్య శ్వేత పేరిట గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాడు. దీంతో మున్సిపల్‌ వారు ఆ స్థలాన్ని రంగినేని శ్వేత పేరిట మ్యూటేషన్‌ చేశారు. ఆదిలాబాద్‌అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రెగ్యులరైజేషన్‌ కోసం రూ.22,900 చలాన్‌ చెల్లించినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. రెవెన్యూ అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసినట్లు నకిలీ పత్రాలు తయారు చేశాడు. ఆ తర్వాత ఇంటి నిర్మాణం కోసం మున్సిపల్‌ నుంచి పర్మిషన్‌ తీసుకోగా అధికారులు అనుమతించారు. ఈ స్థలా న్ని విక్రయించేందుకు సైతం సిద్ధమైనట్లు పేర్కొన్నారు. కాగా ఈ రోడ్డు పక్కన ఉన్న జిన్నింగ్‌ ఫ్యాక్టరీ గేటును కబ్జా చేసి స్థలాన్ని ఆక్రమించడంతో కౌటివార్‌ సుశీల్‌ వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేయడంతో కేసు నమోదైంది. పత్రాలను పరి శీలించగా నకిలీవని తేలింది. దీంతో రంగినేని శ్రీని వాస్‌తో పాటు అతని తండ్రి సూర్యప్రకాశ్‌రావు, చెల్లెలు శ్వేత, బావ అమూల్‌పై కేసు నమోదు చేయగా శ్రీనివాస్‌, అమూల్‌ను రిమాండ్‌కు తరలించిన ట్లు పేర్కొన్నారు. సమావేశంలో వన్‌టౌన్‌, రూరల్‌ సీఐలు సునీల్‌ కుమార్‌, ఫణిందర్‌ పాల్గొన్నారు.

ఐదుగురి రిమాండ్‌..

గుడిహత్నూర్‌కు చెందిన జాదవ్‌ రమేశ్‌ కేఆర్‌కే కాలనీలోని సర్వే నం.68లో ప్లాట్‌ కొనుగోలు చేయగా అట్టి స్థలాన్ని ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన 8 మంది ఆక్రమించేందుకు యత్నించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఆ ప్లాట్‌ను తక్కువ ధరకు విక్రయించాలని, బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఫిర్యాదు చేయడంతో మహ్మద్‌ ముజాహిద్‌ అలియాస్‌ పత్తి ముజ్జు, ఇస్మాయిల్‌ అలియాస్‌ తౌఫిక్‌, షేక్‌ ఆబిద్‌, షేక్‌ ఆదిల్‌, సర్ల బుచ్చన్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, ఆదినాథ్‌, అతీఖ్‌, సయ్యద్‌ అహ్మద్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement