
బాధ్యతలు స్వీకరించిన డీఏవో ఛత్రునాయక్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ)గా భూక్య ఛత్రునాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా వ్యవసాయ కార్యాలయంలో ఏడీఏలు, ఏవోలు పూలమొక్కలు అందజేసి స్వాగతం పలికారు. ఈ నెల 11న జిల్లా వ్యవసాయ అధికారి కల్పన వరంగల్ జిల్లాకు బదిలీ కాగా.. అక్కడి నుంచి డిప్యూటేషన్‌పై హైదరాబాద్ కమిషనరేట్‌కు వెళ్లారు. కరీంనగర్ ఎఫ్‌టీసీ కార్యాలయం డీడీ ఛత్రునాయక్ జిల్లా వ్యవసాయ అధికారిగా నియామకం అయ్యారు. బుధవారం కల్పన నుంచి ఛత్రునాయక్ బాధ్యతలు స్వీకరించారు. భీమిని ఏడీఏ సురేఖ, వ్యవసాయ కార్యాలయం ఏడీఏ గోపి, ఏవోలు శ్రీనివాస్, తరుణ్, ఫర్హాన, ఏఈవోలు పాల్గొన్నారు.