
కల్లు బట్టీపై టాస్క్‌ఫోర్సు దాడులు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఉన్న తెల్లకల్లు బట్టీపై ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కల్లు నమూనాలు సేకరించారు. బాటిళ్లకు సీల్ వేసి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ సీఐ సమ్మయ్య మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన కల్తీ కల్లు ఘటన నేపథ్యంలో దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సేకరించిన కల్లు నమూనాలను నిజామాబాద్‌లోని కెమికల్ ల్యాబ్‌కు పంపిస్తామని తెలిపారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎక్సైజ్ టాస్క్‌ఫోర్సు సిబ్బంది సాగర్, రమేష్, కవిత పాల్గొన్నారు.