
మారు పేర్ల సమస్య పరిష్కరించాలి
శ్రీరాంపూర్: సింగరేణిలో మారుపేర్ల సమస్య పరిష్కరించాలని ఐఎన్టీయూసీ సెక్రెటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, నాయకులు సింగరేణి డైరెక్టర్(పా) గౌతమ్ పొట్రును కోరారు. ఈ మేరకు మంగళవారం కొత్తగూడెంలో ఆయన ను కలిసి వినతిపత్రం అందజేశారు. మెడికల్ బోర్డును సత్వరమే నిర్వహించాలని, హయ్య ర్ సెంటర్ రెఫరల్ కేసులు పరిష్కరించాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఉద్యోగం నుంచి తొలగించిన మైనింగ్ సిబ్బందికి ఉద్యోగాలు కల్పించాలని, ఒడిశాలోని నైనీబ్లాక్‌లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంటు చేపట్టాలని తెలిపారు. కంపెనీలో మందుల కొరత తీర్చాలని, బదిలీ కోసం కంపెనీ ఇటీవల విడుదల చేసిన నూతన పాలసీ రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సీనియర్ ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి, ధర్మపురి, త్యాగరాజన్, జెటి్‌ట్ శంకర్‌రావు, ప్రధాన కార్యదర్శి వికాస్ కుమార్‌యాదవ్ పాల్గొన్నారు.