
‘ఎల్లంపల్లి’కి స్వల్పంగా వరద
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఏప్రిల్ 15వరకు ఎనిమిది టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం మూడు నెలలుగా అంతే ఉండగా.. తొమ్మిది టీఎంసీల చేరువకు వచ్చింది. ఇటీవల వర్షాలు కురిసినా నీటిమట్టం పెరగలేదు. ఎగువ ప్రాంతాల నుంచి 452క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 331 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. మంగళవారం 20.175 టీఎంసీలకు గాను 8.899 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉంది.