‘టీసీఏకు అధికారాలు కట్టబెట్టాలి’ | - | Sakshi
Sakshi News home page

‘టీసీఏకు అధికారాలు కట్టబెట్టాలి’

Jul 16 2025 3:51 AM | Updated on Jul 16 2025 3:51 AM

‘టీసీఏకు అధికారాలు కట్టబెట్టాలి’

‘టీసీఏకు అధికారాలు కట్టబెట్టాలి’

బెల్లంపల్లి: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) అవినీతిలో కూరుకుపోయిన దృష్ట్యా తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌(టీసీఏ)కు అధికారాలు కట్టబెట్టాలని టీసీఏ జిల్లా ఇన్‌చార్జి పైడిమల్ల నర్సింగ్‌ అన్నారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీసీఐ ఏటా హెచ్‌సీఏకు అందజేస్తున్న రూ.100 కోట్లు తెలంగాణలోని ఏ జిల్లాలోనూ ఖర్చు చేయలేదని తెలిపారు. నిధులతో ఏ క్రీడాసామగ్రి కొనుగోలు చేశారు, ఏ జిల్లాలో ఎంతమందికి శిక్షణ ఇచ్చారో వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా టీసీఏ కో ఆర్డినేటర్‌ వెంకటేశ్వర్లు, కోచ్‌లు శేఖర్‌, గౌతమ్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement