
పేదల కోసమే రేషన్ కార్డులు
లక్సెట్టిపేట: పేదల కోసమే ప్రభుత్వం రేషన్‌కార్డులు పంపిణీ చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఎంతమంది రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకున్నా విచారణ చేపట్టి అందిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌కార్డులు పంపిణీ చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందని తెలిపారు. మండలంలో 1538 రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దిలీప్‌కుమార్, పార్టీ పట్టణాధ్యక్షుడు ఎండీ.ఆరీఫ్, మండల అధ్యక్షుడు పింగిళి రమేష్, నాయకులు శ్రీనివాస్, చింత అశోక్, నాగభూషణం, పూర్ణచందర్‌రావు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నస్పూర్: వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. పట్టణ పరిధిలోని కేజీబీవీని మంగళవారం ఆయన సందర్శించారు. తరగతులు, వంటశాల, పరిసరాలను పరిశీలించారు. సౌకర్యాలు, విద్యాబోధనపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, అదనపు గదులు ఇతర సౌకర్యాలు కల్పించిందని తెలిపారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తెలిపారు.
మహిళల సంక్షేమం కోసం చర్యలు
మంచిర్యాలటౌన్: మహిళల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాతమంచిర్యాలలో ఇందిరా మహిళా భవన్ నిర్మాణ పనులను సందర్శించి, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించా రు. కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్లు ఏర్పాటు, పెరటి కోళ్ల పెంపకం, డెయిరీఫామ్, పెట్రోల్‌బంక్ ఇతర వ్యా పార అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.
● కలెక్టర్ కుమార్ దీపక్

పేదల కోసమే రేషన్ కార్డులు