
ఫెయిల్యూర్ సక్సెస్‌కు అడ్డు కాదు
బాసర: ఫెయిల్యూర్ అనేది సక్సెస్‌కు అడ్డుకాదని ఆర్జీయూకేటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. సోమవారం ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్‌తో కలిసి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ కంఫర్ట్ జోన్ , ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్, గ్రోత్ జోన్ అనే జీవన దశలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీ ఒక శ్రీలెర్నింగ్ జోన్‌శ్రీ అని విద్యార్థుల అభ్యాసానికి, అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుందన్నారు. అపజయాలను మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. విజయం సాధించాలంటే నిరంతర కృషి, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. సగటు విద్యార్థులు కూడా అసాధారణ విజయాలు సాధించగలరన్నారు. ముఖ్యంగా ధైర్యం, ధృఢ సంకల్పంతో ఎదగాలన్నారు. నిజమైన విజయం బయట నుంచి రాదని, అది మన లోపల నుంచే మొదలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ డీన్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ నాగరాజు, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్
విద్యార్థులతో ముఖాముఖి

ఫెయిల్యూర్ సక్సెస్‌కు అడ్డు కాదు