
వాగు దాటి వైద్యం అందించి..
కెరమెరి: కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యసిబ్బంది సోమవారం మండలంలోని లక్మాపూర్ వాగు దాటి గ్రామానికి వెళ్లి వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 30 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మాత్రలు అందించారు. అనుమానితుల వద్ద నుంచి రక్తపూతలు సేకరించారు. వానాకాలం వచ్చిందంటే అటు ప్రజలకు, ఇటు అధికారులకు ప్రయాణ తిప్పలు తప్పడం లేదు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ మెస్రం సోము, హెచ్‌ఏలు వసంత్, శంకర్, ఏఎన్‌ఎం సుమలత, ఆశా వర్కర్ తారా, తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి: మండలంలోని పిట్టబొంగురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్ రాథోడ్ జలేందర్ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని చిత్తాబట్టలో వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామానికి వెళ్లే మార్గంలో వాగు ఉండడంతో నీటి ప్రవాహంలో వాగును దాటి గ్రామానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ గంగమ్మ, ఏఎన్‌ఎంలు సంతోషిని, దేవిక, సునీత, తదితరులు పాల్గొన్నారు