
అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి 10వ వార్డు పరిధిలో 20ఏళ్ల క్రితం అంగన్‌వాడీ కేంద్రం ఉండేది. అప్పటి నాయకుల ఒత్తిడితో కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధి నాయక్‌గూడెం తరలించారు. మా పరిధిలోని పిల్లలు, గర్భిణులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయగా సర్వే చేశారు. ఇంతవరకు కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఇప్పటికై నా అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి. – కొక్కే చంద్రశేఖర్,
మాజీ కౌన్సిలర్, బెల్లంపల్లి