
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన అర్జీల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు అలసత్వం ప్రదర్శించొద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీశాఖ అధికారి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్లు, భూ పరిహారం, పోడు భూములు, తదితర సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. తన తల్లి గొర్రె లస్మమ్మ పేరిట తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 2023 వానాకాలం సీజన్ రూ.74,933 తీసుకున్నామని, 2023 మార్చి 24న తన తల్లి చనిపోయిందని, ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ కాలేదని, రుణమాఫీ అయ్యేలా చూడాలని హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన గొర్రె దయాకర్ కోరారు.
మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ దేవాలయం ఆర్థిక లావాదేవీలు దేవాదా య శాఖ పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని బొక్కలగుట్ట గ్రామానికి చెందిన బలికొండ కిషన్ కోరారు. ఆదాయం దుర్వినియోగం కాకుండా చూడాలని విన్నవించారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజావాణిలో దరఖాస్తుల స్వీకరణ
ఈ ఏడాది లోన్లు ఇస్తలేరు
కన్నెపెల్లి మండలం దాంపూర్ పోడు రైతులం. ఆర్వోఆర్ పట్టాభూమి పాస్‌పుస్తకాలు అందించారు. 2024లో బ్యాంకులో పంటలోను ఇచ్చారు. వడ్డీతో కలిపి చెల్లించాం. ఈ ఏడాది బ్యాంకు అధికారులు పంటలోన్లు ఇస్తలేరు.
– దాంపూర్, కన్నెపెల్లి మహిళా రైతులు

అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు