
విషపు మొక్కలు తిని 70 గొర్రెలు మృత్యువాత
పెంచికల్‌పేట్: మండలంలోని లోడుపల్లి శివారులో విషపు మొక్కలు తిని 70 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. కౌటాల మండలంలోని శీర్షా గ్రామానికి చెందిన లీలయ్య, శంకర్, భీరయ్య గొర్రెలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడు రోజుల క్రితం పెంచికల్‌పేట్ మండలంలో గొర్రెలను మేపటానికి వలస వచ్చారు. సోమవారం పంచపూల మొక్కలను తిన్న 70 గొర్రెలు మృతి చెందాయి. యజమానులు ఇచ్చిన సమాచారంతో పశువైద్యాఽధికారి రాకేష్ తీవ్ర అస్వస్థతకు గురైన గొర్రెలకు చికిత్స అందించారు. గొర్రెలు చనిపోవడంతో ఉపాధి పోయిందని ప్రభుత్వం ఆదుకోవాలని యజమానులు కోరుతున్నారు.