
ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్ షురూ
బాసర: 2025–26 విద్యాసంవత్సరానికి గానూ బాసర ఆర్జీయూకేటీ, మహబూబ్‌నగర్ కేంద్రాల్లో ప్రవేశానికి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్‌డీ ప్రొఫెసర్ మురళీధర్‌తో కలిసి సంగారెడ్డి జిల్లా కామోల్ గ్రామానికి చెందిన మొదటి ర్యాంక్ సాధించిన గడ్డం వర్షికకు తొలి అడ్మిషన్ పత్రాన్ని అందజేశారు.
ఈ ఏడాది మొత్తం 1,690 మందికి ప్రవేశాలు కల్పించనుండగా ప్రతీరోజు 564 మంది విద్యార్థులను కౌన్సెలింగ్‌కు పిలుస్తున్నామని అధికారులు తెలిపారు. సోమవారం 500 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు కన్వీనర్‌గా డా.చంద్రశేఖర్, కో కన్వీనర్లుగా డా.దేవరాజు, బండి హరికృష్ణ, సభ్యులుగా డా. విట్టల్, డా.భవ్‌సింగ్ వ్యవహరిస్తున్నారు. విశ్వవిద్యాలయ పీఆర్‌ఓగా డా.విజయ్ కుమార్ పాల్గొన్నారు. గైర్హాజరైన విద్యార్థుల స్థానాలను త్వరలోనే వెయిటింగ్ లిస్టు ఆధారంగా భర్తీ చేయనున్నట్లు తెలిపారు.