
‘బీజేపీ, బీఆర్‌ఎస్‌ల అసత్య ప్రచారాలు తిప్పికొట్టాలి’
జన్నారం: బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆర్‌ఆర్‌ఎస్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన జన్నారం, దస్తురాబాద్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన పాపం వల్లే నేడు రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. అందరికీ రేషన్ కార్డులు అందించి ఉంటే నేడు రూ.2లక్షల వరకు రుణమాఫీ అయ్యేదన్నారు. బీజేపీ ప్రభుత్వం యూరియా కొరత సృష్టించి రైతులకు తీవ్రం అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పీఏసీఎస్ చైర్మన్‌లు రవి, రమేశ్‌రావు, జన్నారం, దస్తురాబాద్ మండలాల ముఖ్య నాయకులు ముజాఫర్ అలీఖాన్, పంకజ, సుభాష్‌రెడ్డి, శంకరయ్య, ఇసాక్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.