
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం త
ఆలస్యంగా అమృత్ పనులు
● బెల్లంపల్లికి వచ్చేనా గోదారి జలాలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా సరిగా లేదు. ఒక్కోసారి సరిగా శుద్ధి చేయకుండానే నీటి సరఫరా చేస్తున్నారు. కార్మికేతర కుటుంబాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతోంది. సింగరేణి యాజమాన్యం కార్మిక కుటుంబాలకు నీటిని అందిస్తోంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అడ ప్రాజెక్ట్ నుంచి సరఫరా అవుతున్న నీటిని ప్ర జలు తాగలేకపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాటర్ ప్లాంట్ల వద్ద కొని తాగుతున్నారు. కన్నాలబస్తీ ఓవర్ హెడ్ ట్యాంక్ వాల్వ్ లీకై ంది. ఇందులోకి మురుగునీరు వెళ్లి తాగునీరు కలుషితమవుతోంది. అడ ప్రాజెక్ట్ ఇంటెక్ వెల్ నుంచి బెల్లంపల్లికి వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ తరచూ లీకవుతోంది. నెలకోసారి ఎక్కడో చోట పైపులు ఒత్తిడికి గురై లీ కేజీలేర్పడుతున్నాయి. లీకేజీలకు మరమ్మతు చేయాలంటే వారం పడుతోంది. దీంతో బస్తీవాసులు చేతిపంపులను ఆశ్రయిస్తున్నారు. అంతర్గత పైపుల లీకేజీని మిషన్ భగీరథ, మున్సిపల్ సిబ్బంది వేర్వేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఒక్కో విభాగం నుంచి 10 మంది సి బ్బంది పని చేస్తున్నా సమస్య వచ్చిన వెంట నే పరిష్కారం లభించడం లేదనే ఆరోపణ లున్నాయి. కంపెనీ క్వార్టర్లలో నివాసముంటున్న కార్మికులు, నల్లా కనెక్షన్ తీసుకున్న కా ర్మికేతరులకు సింగరేణి యాజమాన్యం నీటి సరఫరా చేస్తోంది. పూర్తిస్థాయిలో కార్మికులు నివాసముంటున్న బస్తీల్లో రోజువారీగా నీటి ని సరఫరా చేస్తుండగా, మిగతా బస్తీల్లో మూ డు, నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాకు ప్రత్యేకంగా బిల్డింగ్ డిపార్ట్‌మెంట్ ఉన్నా ఆటంకాలేర్పడుతున్నా యి. గోదావరి జలాలు అందించేందుకు ఎ ల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి బెల్లంపల్లి వరకు అ మృత్ 2.0 పథకం ద్వారా 25 కిలో మీటర్ల వ రకు అంతర్గత పైపులైన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం 11కిలో మీటర్ల వరకే పనులు పూర్తయ్యాయి. బంగారు మైసమ్మ గుడి పక్కన 11లక్షల గ్యాలన్ల నీటి సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ పనులూ మందకొడిగా సాగుతున్నాయి. అ మృత్ పథకం అమలు, పైపులైన్ నిర్మాణ ప నులను ప్రజారోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
నీటిని కొని తాగుతున్నం
మిషన్ భగీరథ నీరు ఐదారురోజులకోసారి వస్తోంది. అడ ప్రాజెక్ట్ నీళ్లు శుద్ధి చేసి పంపిస్తున్నా తాగలేక పోతున్నం. తప్పనిసరి పరిస్థితుల్లో ప్యూరిఫైడ్ వాటర్ కొని తాగుతున్నం. నేటికీ పైపులైన్ పనులు పూర్తి కాలేదు. మాకు గోదావరి జలాలు ఎప్పడిస్తారో అధికారులకే తెలియాలి.
– ఆర్ అయిలయ్య, టేకులబస్తీ
మందమర్రిలో ‘డబుల్’ కష్టాలు
మందమర్రిరూరల్: మందమర్రి మున్సిపాలిటీ పరి ధిలోని పాలచెట్టు ఏరియా సమీపానగల డబుల్‌బెడ్రూం నివాసాల ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 243 కుటుంబాలుండగా ఇప్పటివరకు పైపులైన్ లేక తాగునీరు సరఫరా కావడంలేదు. వెంటనే పైపులైన్ ఏర్పాటు చేసి తాగునీరు సరఫరా చేయాలని ఆ కాలనీవాసులు కోరుతున్నా రు. మున్సిపాలిటీలో 24 వార్డులుండగా నీటి సరఫ రా కోసం 18 మంది సిబ్బందిని కేటాయించారు. మందమర్రికి సరఫరా అయ్యే తాగునీరు ఎల్లంపల్లి వద్దనే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ నుంచి శుభ్రమై వస్తాయని మున్సిపల్ ఏఏఈ సందీప్ తెలిపారు. అయినప్పటికీ మందమర్రిలోని వాటర్ ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ వేసి శుభ్రమైన నీరు సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. లీకేజీ సమస్య వచ్చిన వెంటనే మరమ్మతు చేయిస్తున్నామని తెలిపారు.
అమృత్ 2.0 కింద నస్పూరు బీఆర్‌ఎస్ భవనం వద్ద చేపట్టిన వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులు
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సరఫరాలో తరచూ ఇబ్బందులేర్పడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పైపులైన్ లీకేజీ కారణంగా వర్షపునీరు చేరి తాగునీరు కలుషితమవుతోంది. ఒకచోట లీకేజీలకు మరమ్మతు పూర్తి చేయగానే మరోచోట సమస్య ఉత్పన్నమవుతోంది. మంచిర్యాల మున్సిపాలిటీకి 15 ఏళ్ల నుంచే ముల్కల్ల గోదావరి వద్ద ఫిల్టర్ బెడ్ నిర్మించి అక్కడి నుంచి నీటి సరఫరా చేస్తున్నారు. రూ.29.30 కోట్లతో ఫిల్టర్ బెడ్ నిర్మించగా మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి నీటిని ముల్కల్ల ఫిల్టర్‌బెడ్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి మంచిర్యాలకు సరఫరా చేస్తున్నారు. 15 ఏళ్ల క్రితం వేసిన పైపులైన్‌కు తరచూ లీకేజీలేర్పడుతున్నాయి. గతేడాది అమృత్ 2.0 పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.48.50 కోట్లు, నస్పూరు మున్సి పాలిటీకి రూ.73 కోట్లు కేటాయించారు. మంచిర్యాలలో కొత్తగా 6,100 నల్లా కనెక్షన్లు, 21 కిలోమీటర్ల పైపులైన్ మార్పు, ఒక వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నస్పూరులో 5వేల నల్లా కనెక్షన్లు, 18 కిలోమీటర్ల పైపులైన్, ఏడు వాటర్ ట్యాంకులు, ఒక ఫిల్టర్ బెడ్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఏడాది క్రితం పనులు ప్రారంభించారు. మంచిర్యాల, నస్పూరులో పనులు 30 శాతమే అయ్యాయి. వచ్చే ఏడాది జూన్‌లోపు పూర్తిచేయాల్సి ఉండగా జాప్యం జరుగుతోంది. గతంలో వేసిన పైపులకు తరచూ లీకేజీలేర్పడుతుండడంతో తాగునీరు కలుషితమవుతోంది. దీనికితోడు మంచిర్యాల కార్పొరేషన్ తాగునీటి సరఫరా విభాగంలో 83 మంది మాత్రమే పని చేస్తుండగా పూర్తిస్థాయిలో సమస్యలు వెంటవెంట పరిష్కారం కావడంలేదు. అమృత్ 2.0 పథకం పనులు పూర్తయితేనే కార్పొరేషన్ పరిధిలోని తాగునీటి పైపులైన్ లీకేజీలకు ఫుల్‌స్టాప్ పడే అవకాశముంది.
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో అధికా రుల నిర్లక్ష్యం కారణంగానే తాగునీటి సమస్య ఉన్న ట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ పరి ధిలో 18 వార్డులుండగా, 25,579 మంది జనాభా ఉంది. 7,629 నల్లా కనెక్షన్లకు నేటికీ 5,676 మాత్ర మే ఇచ్చారు. మరో 1,953 ఇవ్వాల్సి ఉంది. వార్డుల్లో 190 చేతిపంపులున్నాయి. మిషన్ భగీరథ నుంచి ప్రతీరోజు 3.5 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ ఫర్ డే) సరఫరా చేస్తుండగా చేతిపంపుల నుంచి సుమారు 50వేల లీటర్ల నీరు అందుతోంది. అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన ట్యాంక్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్, బోర్ల నుంచి వేసిన పైపులైన్ పూర్తిగా డ్రైనేజీల్లోనే ఉంది. దీంతో పైపులైన్లకు లీకేజీలేర్పడితే తా గునీరు కలుషితమవుతోంది. గత ఫిబ్రవరిలో నల్లా ల ద్వారా వచ్చిన కలుషిత నీరు తాగి బట్టిగూడెం, పద్మశాలివాడ, మంగలిబజార్, జెండవాడకు చెందిన సుమారు 100 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. అయినా నేటికీ పైపులైన్లు డ్రైనేజీల నుంచి తొలగించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇది వానాకాలం కావడంతో తా గునీరు కలుషితమయ్యే ప్రమాదమున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
సమస్యలు పరిష్కరిస్తాం
మురుగు కాలువల్లో పైపులైన్లు ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. మున్సిపాలిటీలో పైపులైన్ల లీకేజీ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే డ్రైనేజీల్లోని పైపులైన్లను తొలగించే ఏర్పాట్లు చేస్తాం. నీరు కలుషితం కాకుండా చర్యలు చేపడతాం. తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.
– విద్యాసాగర్, మిషన్ భగీరథ డీఈ, చెన్నూర్
నల్లా కనెక్షన్లే లేవు
కొత్తగూడెం బైపాస్ రోడ్డులో నల్లా కనెక్షన్లే లేవు. రోజూ ఇతర నల్లాల వద్ద నుంచి నీటిని తెచ్చుకుంటున్నం. వానాకాలంలోనూ తాగునీటికి గోస పడుతున్నం. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైపులైన్ వేయాలె. మా కాలనీలో నల్లా కనెక్షన్లు ఇయ్యాలె.
– వరప్రసాద్, కొత్తగూడెం కాలనీ
భగీరథ నీరు తాగుతలేం
మిషన్ భగీరథ నీరు వాసనొస్తోంది. బతుకమ్మ వాగు నుంచి వచ్చే నీరే బాగుంటోంది. కాలనీలకు బతుకమ్మ వాగునీటి సరఫరా పునరుద్ధరించాలి. మైసమ్మ గుడి పక్కనున్న నల్లా వద్ద నుంచి బతుకమ్మ వాగు నీటిని తెచ్చుకుని తాగుతున్నం.
– రాగుల సమ్మయ్య, మహంకాళివాడ
సార్ల నిర్లక్ష్యం.. చెన్నూర్‌కు శాపం

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం త

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం త

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం త

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం త

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం త

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం త

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రజలు నిత్యం త