
లక్ష్యాల సాధనకు కృషి చేయాలి
శ్రీరాంపూర్: కంపెనీ నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి ల క్ష్యాల సాధనకు కృషి చేయాలని సింగరేణి డైరెక్టర్ (పా) గౌతం పొట్రు సూచించారు. డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటిసారి ఆయన మంగళవారం శ్రీరాంపూర్‌లో పర్యటించారు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్, ఆర్కే న్యూటెక్ గనులను సందర్శించి బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం జీఎం కార్యాలయంలో బొగ్గు ఉత్పత్తిపై రీజియన్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ.. వానాకాలంలో ఓపెన్ కాస్ట్ గనుల్లో వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తేనే సింగరేణి అభివృద్ధి సాధిస్తుందని తెలి పారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూ చించారు. ఏరియా జీఎం శ్రీనివాస్, బెల్లంపల్లి జీఎం విజయభాస్కర్‌రెడ్డి, మందమర్రి జీఎం దే వేందర్, శ్రీరాంపూర్ ఏరియా ఎస్వోటూ జీఎం స త్యనారాయణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ఏజెంట్ రాజేందర్, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి వెంకటేశ్వ ర్లు, మేనేజర్ శ్రీనివాస్, రక్షణాధికారి శ్రీధర్, న్యూ టెక్ మేనేజర్ శ్రీనివాస్, రక్షణాధికారి కొట్ట్టె రమేశ్, పిట్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.