
ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి
చెన్నూర్: స్థానికులకు గోదావరి ఇసుక అందుబాటులో ఉండేలా రీచ్ ఏర్పాటు చేయాలని బీ జేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌ డ్ డిమాండ్ చేశారు. గోదావరి ఇసుకకు అనుమతి ఇవ్వాలని ట్రాక్టర్ యజమానులు మంగళవారం చేపట్టిన సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటి నిర్మాణదారులు దళారులను ఆశ్రయించి ట్రాక్ట ర్ ఇసుకకు రూ.4వేలు చెల్లించాల్సిన పరిస్థితి నె లకొందని తెలిపారు. కలెక్టర్ స్పందించి ఆన్‌లై న్ పద్ధతిలో చెన్నూర్ ప్రజలకు గోదావరి ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ట్రాక్టర్ యజమానులు పాల్గొన్నారు.