
పనులు త్వరగా పూర్తిచేయాలి
లక్సెట్టిపేట: ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి భవన ని ర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సూచించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన 30 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈ నెల 13న ఆస్పత్రి భవనాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులకు పలు సూ చనలు చేశారు. ఆయన వెంట జీసీసీ చైర్మన్ కో ట్నాక తిరుపతి, నాయకులు శ్రీనివాస్, ఎండీ ఆరీఫ్, పింగిళి రమేశ్, చింత అశోక్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.