
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
● కలెక్టర్ కుమార్‌దీపక్
జైపూర్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సూ చించారు. మండలంలోని పెగడపల్లి, టేకుమట్ల గ్రా మాల్లో నిర్వహించిన వనమహోత్సవం–2025లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవం–2025లో భా గంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను ఆయా శా ఖల అధికారులు పూర్తిస్థాయిలో సాధించేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. జిల్లా గ్రా మీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెగడపల్లిలో వె య్యి మొక్కలు, టేకుమట్లలో 600మొక్కలు నాటిన ట్లు తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కే జీబీవీని సందర్శించారు. తరగతి గదులు, వంటశా ల, పరిసరాలు పరిశీలించారు. తరగతి గదిలో వి ద్యార్థినులతో మాట్లాడి వారి సామర్థ్యాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. నూతనంగా చేపట్టిన కేజీబీవీ భవన నిర్మాణ పనులు పరిశీలించి త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.