
9 నుంచి రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు
రామకృష్ణాపూర్: పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 9 నుంచి 12 వరకు బాలికల జూనియర్స్ రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొననున్నారని, వారికి వసతి, భోజన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజుతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, వొడ్నాల శ్రీనివాస్, క్రీడాకారులు పాల్గొన్నారు.