
జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య
మందమర్రిరూరల్: జీవితంపై విరక్తితో ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల మేరకు రామన్‌కాలనీకి చెందిన లారీ డ్రైవర్ కటకం శ్రీనివాస్ (45)15 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి పనిచేయలేని స్థితికి చేరుకున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతుని భార్య రమ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఉరేసుకుని వృద్ధుడు..
దండేపల్లి: మద్యానికి బానిసై ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన మనుపాట రాజయ్య (74)కొంతకాలంగా కడుపులో నొప్పితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం మద్యం సేవించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. పక్కింట్లో ఉంటున్న ఎద్దు సురేశ్ సోమవారం ఉదయం బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి రాజయ్య మామిడితోటలో చెట్టుకు ఉరేసుకున్నాడని సమాచారం ఇచ్చాడు. మృతుని కుమారుడు మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
మద్యానికి బానిసై..
కుభీర్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోచోటు చేసుకుంది. ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు మండలంలోని పార్డి(బి)గ్రామానికి చెందిన తోట రమేశ్ (34) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. సోమవారం ఉదయం మద్యం మత్తులో ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
బాలుడిని పనిలో పెట్టుకున్న వ్యక్తిపై కేసు
ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలో గల మెట్రో ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లో బాలుడి(14)ని పనిలో పెట్టుకున్న యజమాని నజీమ్ మోయినొద్దీన్‌పై సోమవారం కేసు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్‌రావు తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ బృందం తనిఖీ చేయగా బాలుడితో పనులు చేయిస్తూ కనిపించారని ఆయన పేర్కొన్నారు. దీంతో ముస్కాన్ బృందం ఇన్‌చార్జి శంకర్ గుప్తా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
వాంకిడి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఖిరిడి గ్రామానికి చెందిన నానవేణి గణేశ్ (30) వాంకిడిలో బైక్ మెకానిక్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా నాలుగు వరుసల జాతీయ రహదారి–363పై టోల్‌ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముందుగా ఆసిఫాబాద్ ఆస్పత్రిలో ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల, అక్కడి నుంచి కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. మృతుని భార్య రవళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
బాలుర వసతిగృహం తనిఖీ
మంచిర్యాలఅర్బన్: పట్టణంలోని ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహాన్ని సోమవారం జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి దుర్గాప్రసాద్ తనిఖీ చేశారు. ఉదయం అల్పాహారం (టిఫిన్) ఉప్మా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అమలుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వసతిగృహ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సరుకుల నాణ్యతను, రికార్డులను తనిఖీ చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నాణ్యమైన భోజనం వేడివేడిగా రుచికరంగా విద్యార్థులకు అందించాలని వసతిగృహ సంక్షేమాధికారి, సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అసిస్టెంట్ సోషల్ ఆఫీసర్ రవీందర్, వసతిగృహ సంక్షేమాధికారి కుమారస్వామి ఉన్నారు.

జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య

జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య