
బాలికల వసతిగృహం తనిఖీ
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాన్ని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి(డీడీ)దుర్గాప్రసాద్ ఆదివారం తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటగది పరిసర ప్రాంతాలను కలియతిరిగారు. నిత్యావసర సరుకులు, రిజిస్టర్ పరిశీలించారు. భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. అనంతరం ఎస్సీ బాలికల కళాశాల వసతిగృహంలో బాబు జగ్జీవన్‌రామ్ వర్ధంతి నిర్వహించారు. దుర్గాప్రసాద్ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమ అధికారి రవీందర్‌గౌడ్, వసతిగృహ సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు.