
● మొదటి విడతలో 85 మంది ఎంపిక ● మరింత మంది నియామకానికి చ
కీలకంగా వ్యవహరిస్తాం..
తిరిగి మాతృ సంస్థలతో రావడం ఆనందంగా ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమకు అవకాశం కలిపించినందుకు కృతజ్ఞతలు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ, ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కీలకంగా వ్యవహరించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తాం.
– సాగె ఓంకార్, జీపీవో, మంచిర్యాల
మంచిర్యాలరూరల్(హాజీపూర్): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వీఆర్‌ఏ, వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించింది. దీంతో రెవెన్యూ వ్యవస్థలో మార్పులు చో టుచేసుకున్నాయి. అయితే, ఈ మార్పులు రైతులకు ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. ధరణి పోర్టల్‌పై విమర్శలు రావడంతో, 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా, గతంలోని నిబంధనలను పునరుద్ధరిస్తూ, వీఆ ర్‌ఏ, వీఆర్‌వోల స్థానంలో గ్రామ పరిపాలన అధి కారుల (జీపీవో) వ్యవస్థను తిరిగి తీసుకొచ్చింది.
నియామకానికి పరీక్ష..
జిల్లాలో 16 మండలాలు, 306 గ్రామ పంచాయతీలు, 385 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. గతంలో వీఆర్‌ఏ, వీఆర్‌ఓలుగా పనిచేసి, ఇతర శాఖల్లో విలీనమైన వారికి ప్రభుత్వం తిరిగి రెవెన్యూ శాఖలో చేరే అవకాశం కల్పించింది. జీపీవోలుగా నియమించేందుకు ఇంటర్, డిగ్రీ అర్హతతో ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించగా, 155 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 132 మంది రాత పరీక్షకు హాజరై, 88 మంది అర్హత సాధించారు. ముగ్గురు ఈ పదవిని స్వీకరించడానికి ఇష్టపడకపోవడంతో, 85 మందిని జిల్లాకు కేటాయించేందుకు సీసీఎల్‌ఏ ప్రక్రియ కొనసాగుతోంది. కలెక్టర్ కుమార్‌దీపక్ ఒక్కో జీపీవోకు రెండు నుంచి మూడు గ్రామాల బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది.
మరో అవకాశం..
జీపీవో నియామకాలకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నియామకాలు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి, రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి దోహదపడతాయని అంచనా.
జీపీవోల విధులు..
జీపీఓలు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థలో కీలక బా ధ్యతలను నిర్వహిస్తారు. వారి విధుల్లో రెవెన్యూ రికార్డుల నిర్వహణ, భూమిశిస్తు, సెస్, పన్నుల వసూలు, సర్వే రాళ్ల తనిఖీ, జనన, మరణ ధ్రువపత్రాలు, పహణీ, అడంగల్ పత్రాల జారీ వంటివి ఉన్నాయి. అగ్ని ప్రమాదాలు, వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో సమాచారం అందించడం, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, ఓటరు జాబితా తయారీ, శాంతిభద్రతల సమస్యలపై పోలీసులకు సమాచారం అందించడం వంటి బాధ్యతలు కూడా నిర్వహించాలి. అదనంగా, ఇందిరమ్మ, ఉపాధి హామీ వంటి ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు సహకరించడం, వ్యాధుల వ్యాప్తి సమయంలో ఆరోగ్య కేంద్రాలకు సమాచారం అందించడం వంటివి చేయాలి.

● మొదటి విడతలో 85 మంది ఎంపిక ● మరింత మంది నియామకానికి చ

● మొదటి విడతలో 85 మంది ఎంపిక ● మరింత మంది నియామకానికి చ