
‘ఉపాధి’లో అవకతవకలు
మందమర్రిరూరల్: మండలంలో జరిగిన ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. డీఆర్‌డీవో కిషన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. తనిఖీ బృందం దృష్టికి వచ్చిన వివరాలు వెల్లడించారు. మండలంలోని పది పంచాయతీల్లో గత ఆర్థిక సంవత్సరం చేపట్టిన పనులపై ఈ నెల 19నుంచి 28వరకు సామాజిక తనిఖీ చేపట్టారు. ఆయా పంచాయతీల్లో రూ.48వేల జరిమానామాతోపాటు రూ.34వేలు రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ కిరణ్, మండల ప్రత్యేక అధికారి అనిత, జీఎస్ ఏపీవో రజియాసుల్తానా, ఎస్‌ఆర్వోలు, డీఆర్‌వోలు, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.