
ఎల్‌ఆర్‌ఎస్‌కు తప్పని తిప్పలు
మంచిర్యాలటౌన్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. ఎల్‌ఎస్‌ఆర్‌లో 25శాతం రాయితీ వర్తింపు అవకాశం ఈ నెల 30వరకు కల్పించిన విషయం తెలిసిందే. వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలతో రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఎల్1 ఆఫీసర్ లాగిన్‌లోకి కొన్ని రాకపోవడం, ఎఫ్‌టీఎల్, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ సమస్యలు తీర్చకపోవడంతో ఫీజులు చెల్లించలేని పరిస్థితి ఎదురవుతోంది. బుధవారం చివరి రోజు కావడంతో మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ కార్యాలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చి ఫీజు చెల్లించేందుకు తిప్పలు పడ్డారు.
నేడు బసవేశ్వర జయంతి
మంచిర్యాలటౌన్: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 30న ఉదయం 9గంటలకు బసవేశ్వర జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి పురుషోత్తం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, వివిధ సంఘాల నాయకులు సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.