
మెరుగైన వైద్యం అందిస్తున్నాం
● సీఎంఓ కిరణ్ రాజ్‌కుమార్
శ్రీరాంపూర్/మందమర్రిరూరల్/రామకృష్ణాపూర్: సింగరేణి ఉద్యోగులు, కుటుంబ సభ్యులకు కంపెనీ దవాఖానాల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నామని సి ంగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్(సీఎంఓ) కిరణ్ రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. ఆర్కే 8 డిస్పెన్సరీ, నస్పూర్ డిస్పెన్సరీ, మందమర్రిలోని కేకే డిస్పెన్స రీ, రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆస్పత్రుల ను సందర్శించారు. వార్డులను సందర్శించి వైద్య సేవలు, చికిత్సపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది సమయపాలన పా టించాలని సూచించారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం ఎం.శ్రీనివాస్‌తో కలిసి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపెనీలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వేసవి దృష్ట్యా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన ఆయనను ఆయా ప్రాంతాల్లో శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) బీభత్సా, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్ రె డ్డి, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, డీవైసీఎంఓ రమేశ్‌బాబు, ఏరియా రక్షణ అధికారి శ్రీధర్ రావు, పర్చేస్ అధికారి చంద్రశేఖర్, వైద్యులు వేద వ్యాస్, మురళీధర్, లోక్నాథ్ రెడ్డి, ఎస్టేట్ అధికారి వరలక్ష్మి, ఐఈడీ ఎస్‌ఈ కిరణ్ కుమార్, ఎన్విరాన్మెంట్ అధి కారి హనుమాన్ గౌడ్ పాల్గొన్నారు.
ఉద్యోగులకు వైద్యసేవలు
జైపూర్: పవర్ ప్లాంట్ ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సీఎంఓ కిరణ్‌రాజ్‌కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఆవరణలో డిస్పెన్సరీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో వసతులు, ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. డాక్టర్ రవీందర్, శ్యామల ఉన్నారు.