
రవాణా శాఖ తనిఖీలు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు విస్తృతంగా చేపడుతున్నారు. సోమవారం జిల్లా కేంద్రంతోపాటు సీసీసీ, శ్రీరాంపూర్, ఇందారం, ఓపె న్‌కాస్ట్ గనుల పరిసర ప్రాంతాల్లో భారీ, మధ్య తరహా వాహనాలను తనిఖీ చేశారు. ఇంచార్జి డీటీఓ రంజిత్‌రెడ్డి, ఎంవీఐ కిషోర్‌చంద్రారెడ్డి, అసిస్టెంట్ ఎంవీఐ ఖాసింసాహెబ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాహన తనిఖీలు జరిపారు. పన్నులు చెల్లించని, ఫిట్‌నెస్ లేని, ఓవర్‌లోడ్ ఉన్న వాహనాలను గుర్తించి రూ.2 లక్షల వర కు జరిమానా విధించారు. జిల్లాలో వాహన తనిఖీలు నిరంతరం సాగుతాయని, పన్నులు చెల్లించకుండా, ఫిట్‌నెస్ లేకుండా రహదారులపైకి వస్తే వాహనాలను సీజ్ చేయడంతోపాటు భారీ జరిమానా తప్పదని స్పష్టం చేశారు. రవాణా శాఖ హెడ్ కానిస్టేబుల్ చంద్రయ్య, హోంగార్డులు వేణు, రమేశ్ పాల్గొన్నారు.