‘లోకోస్‌’లో స్వయం సహాయక సంఘాల సమాచారం | - | Sakshi
Sakshi News home page

‘లోకోస్‌’లో స్వయం సహాయక సంఘాల సమాచారం

Jun 23 2023 1:28 AM | Updated on Jun 23 2023 9:33 AM

సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారులు  (ఫైల్‌) - Sakshi

సిబ్బందికి అవగాహన కల్పిస్తున్న అధికారులు (ఫైల్‌)

పాతమంచిర్యాల: స్వయం సహాయక సంఘాల సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లోకోస్‌ యాప్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోని స్వయం సహయక సంఘాల పూర్తి సమాచారాన్ని ఈ యాప్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల పొదుపు లెక్కలు, సంఘాల పనితీరు, సంఘాలలోని సభ్యుల సంఖ్యను బుక్‌ కీపింగ్‌ లేదా మొబైల్‌ బుక్‌ కీపింగ్‌, సెర్ప్‌ అకౌంటింగ్‌ యాప్‌, నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీవుడ్‌ మిషన్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. కాని ఈ యాప్‌ల కంటే అడ్వాన్స్‌డ్‌గా యాప్‌ను రూపొందించారు.

ఈ యాప్‌ ద్వారా సంఘాలలోని సమాచారాన్ని ఒక్క క్లిక్‌తో ఎక్కడి నుంచైనా తెలుసుకోవచ్చు. మహిళా సంఘాల సభ్యులకు సంబంధించి బ్యాంక్‌ రుణాలు, పొదుపు లెక్కలు ఒక్క సంఘానికి సంబంధించినవి మాత్రమే తెలుసుకునే వెసులుబాటు ఉండేది. డిజిటలైజేషన్‌ ద్వారా అన్ని సంఘాలు చైతన్యవంతమయ్యాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అప్పులు, పొదుపు లెక్కలను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకునేది. కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం మహిళా సంఘాల సమాచారాన్ని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లలో పొందుపరుస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్‌ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేస్తుంటే కేంద్రం మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, (వీఎల్‌ఆర్‌) మంజూరు చేస్తుంది. ఈ లోకోస్‌ యాప్‌ పనితీరుపై ఇప్పటికే సెర్ప్‌ అధికారులు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. రెండు నెలల క్రితమే యాప్‌లో సంఘాల సమాచారం పొందుపర్చాల్సి ఉండగా వీవోఏల సమ్మె కారణంగా నమోదు ప్రక్రియ ప్రారంభంకాలేదు.

శిక్షణ కల్పిస్తున్నాం
లోకోస్‌ యాప్‌ విధి విదానాలను సెర్ప్‌ సిబ్బందికి శిక్షణ శి?్బరాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. శిక్షణ అనంతరం సంఘాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తాం.

– శ్రీనివాస్‌, అడిషనల్‌ డిఆర్‌డివో, మంచిర్యాల

‘లోకోస్‌ యాప్‌1
1/1

‘లోకోస్‌ యాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement