
ముంబై: బాలీవుడ్‌ని ఎవరూ కూడా ముంబై నుంచి దూరం చేయలేరని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడతూ..ఫిల్మ్ సిటీ, సినీ పరిశ్రమకు అందించే సౌకర్యాలను అధ్యయనం చేయడానికి యోగీ ఇక్కడకు రావచ్చని, ప్రతి బీజేపీ నాయకుడుకి రాష్ట్రాన్ని, సినీ పరిశ్రమను అభివృద్ధి చేసే, సౌకర్యాలు కల్పించే హక్కు ఉందని అన్నారు. కొన్ని నివేదికల ప్రకారం మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సచిన్ సావంత్ బాలీవుడ్‌ను ముంబై నుంచి బయటకు తరలించడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం ముంబై రానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలో యోగీ బాలీవుడ్ ప్రముఖులతో పాటు అక్కడి పారిశ్రామివేత్తలను కలవనున్నారు. (చదవండి: చట్టసభలోకి బాలీవుడ్ బ్యూటీ.!)