ప్రత్యేక పాలనలో చేతి వాటం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక పాలనలో చేతి వాటం

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

బీసీ స్టడీ సర్కిల్‌లో

ఉచిత శిక్షణ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో అభ్యర్థులకు మ్యాజిక్‌ బస్‌ ఇండియా ఫౌండేషన్‌ ద్వారా ఏఐ, మరియు లైఫ్‌స్కిల్‌లో నాలుగు రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ స్వప్న ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లాకేంద్రంలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌ను సంప్రదించాలని, మరింత సమాచారం కోసం 74167 31371 నంబర్‌ను ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.

బాదేపల్లి యార్డుకు

పోటెత్తిన ధాన్యం

జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి 26,088 బస్తాల ధాన్యం, మొక్కజొన్న విక్రయానికి వచ్చింది. ఇందులో 14,083 బస్తాల ధాన్యం విక్రయానికి రాగా ఆర్‌ఎన్‌ఆర్‌ రకం క్వింటా గరిష్టంగా రూ.2,682, కనిష్టంగా రూ.1,689 ధరలు లభించాయి. అదేవిధంగా 10,994 బస్తాల మొక్కజొన్న రాగా క్వింటా గరిష్టంగా రూ.1,962, కనిష్టంగా రూ.1,661 ధరలు లభించాయి. వేరుశనగకు క్వింటా గరిష్టంగా రూ.8,341, కనిష్టంగా రూ.6,570, ఆముదాలు గరిష్టంగా రూ.6,208, కనిష్టంగా రూ.6,189,ఽపొద్దుతిరుగుడు గరిష్టంగా రూ.6,600, కనిష్టంగా రూ.6,589, చింతగింజలు రూ.2,707 ధరలు పలికాయి. కాగా.. బాదేపల్లి యార్డుకు బుధవారం భారీగా దిగుబడులు వచ్చిన కారణంగా బస్తాలను లిఫ్టింగ్‌ చేయని పరిస్థితి ఏర్పడిందని, దీంతో బుధవారం యార్డులో క్రయవిక్రయాలను నిలిపి వేస్తున్నట్లు మార్కెట్‌కార్యదర్శి అశ్వాక్‌ అహ్మద్‌ తెలిపారు. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్‌ ధాన్యం ధర క్వింటా గరిష్టంగా రూ.2,369, కనిష్టంగా రూ.1,969, హంసధాన్యం రూ.1,769, ఆముదాలు రూ.6,150గా ధరలు నమోదయ్యావి.

పడిపోయిన ఉల్లి ధర

దేవరకద్ర: ఉల్లి ధరలు పడిపోయాయి. బుధవారం దేవరకద్ర మార్కెట్‌కు దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి రాగా అందులో సగం మంది రైతులు నేరుగా విక్రయించారు. మిగతా ఉల్లిని వేలం ద్వారా వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో క్వింటా గరిష్టంగా రూ.1,500, కనిష్టంగా రూ.800 వరకు పలికింది. 50 కేజీల బస్తా ధర గరిష్టంగా రూ.750, కనిష్టంగా రూ.400 వరకు విక్రయించారు. బయట వ్యాపారులు రూ.650 నుంచి రూ.700 వరకు అమ్మకాలు సాగించారు.

కాలుష్య జలాలు

చెరువులోకి వదలొద్దు

రాజాపూర్‌: వర్షం నీటి సాకుతో కాలుష్య జలాలను చెరువులోకి వదలొద్దని ముదిరెడ్డిపల్లి గ్రామస్తులు టీఎస్‌ఐఐసీ అధికారులకు తేల్చి చెప్పారు. పోలేపల్లి సెజ్‌లో అండర్‌ డ్రెయినేజీ లేకపోవడంతో టీఎస్‌ఐఐసీ అధికారులు టెండర్లు వేసి సైడ్‌ డ్రైన్‌ కాల్వలను నిర్మిస్తున్నారు. బుధవారం టీఎస్‌ఐఐసీ జెడ్‌ఎం సుబ్బారావు సెజ్‌కి రావడంతో గ్రామస్తులు కలిశారు. ఇప్పటికే తమ గ్రామ పల్లెచెరువు పూర్తిగా కాలుష్యమైందని, చెరువులో చేపలు వేసిన బతకడం లేదన్నారు. కంపెనీల నుంచి విడుదల చేసే కాలుష్య నీటిని చెరువులోకి వదలకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పెద్ద సంపులు నిర్మిస్తామని ఆ తర్వాతే సైడ్‌ డ్రైన్‌ పనులు చేపడతామని జెడ్‌ఎం చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శేఖర్‌గౌడ్‌, గ్రామస్తులు మల్లేష్‌, నర్సింహులు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

9లో

నిధుల వినియోగంలో కార్యదర్శుల విచ్చలవిడి తనం

పనులు చేశామంటూ రూ.లక్షల్లో నిధులు స్వాహా

లైట్లు, మోటార్ల మరమ్మతులంటూ ఎంబీల్లో రికార్డులు

– మహమ్మదాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement