ఆధిపత్యం కోసమే అమెరికా యుద్ధతంత్రం | - | Sakshi
Sakshi News home page

ఆధిపత్యం కోసమే అమెరికా యుద్ధతంత్రం

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసమే అమెరికా యుద్ధతంత్రం రచిస్తోందని ఆప్సో జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.అరుణ్‌కుమార్‌ విమర్శించారు. జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో బుధవారం ప్రోగ్రెసివ్‌ థింకర్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ‘అమెరికా సామ్రాజ్య యుద్ధోన్మాదం.. పర్యవసానాలు’పై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. నిన్న వెనుజుల, నేడు ఇరాన్‌, రేపు క్యూబా.. ఇలా తన వాణిజ్యానికి సహకరించని దేశాలపై అమెరికా దాడులకు తెగబడుతోందని ఆరోపించారు. యుద్ధాలపై ఖర్చులను తగ్గించి అమెరికా అభివృద్ధికి పాటుపడతానని శాంతిమంత్రం పఠించి అధికారం చేజిక్కించుకున్న ట్రంప్‌.. దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో క్యూబాను హస్తగతం చేసుకుంటాననే అమెరికా ప్రకటనను అందరూ ముక్తకంఠంతో నిరసించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రెసివ్‌ థింకర్స్‌ ఫోరం అధ్యక్షుడు విక్రమ్‌ జనార్దన్‌, కార్యదర్శి డా.మధుసూదన్‌రెడ్డి, కన్వీనర్‌ డా. రాంమోహన్‌రావు, ఆప్సో జిల్లా ప్రతినిధులు ఒబేదుల్లా కొత్వాల్‌, లక్ష్మణ్‌గౌడ్‌, జగపతిరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు కిష్టయ్య, సురేష్‌, రవీందర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement