‘పది’లో రిషి విజయభేరి | - | Sakshi
Sakshi News home page

‘పది’లో రిషి విజయభేరి

Apr 30 2026 8:49 AM | Updated on Apr 30 2026 8:49 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని రిషి పాఠశాల విద్యార్థులు విజయభేరీ మోగించారు. ఈ మేరకు పాఠశాల కు చెందిన విద్యార్థు లు కార్తికేయరెడ్డి 594, శ్రీకర్‌ 586, దివ్యశ్రీ 582, జశ్వంత్‌ 580, సాయికీర్తన 580 మార్కులు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశా ల చైర్మన్‌ చంద్రకళావెంకట్‌, డైరెక్టర్లు పూజితామోహన్‌రెడ్డి, శిరీష, ప్రవీణ్‌కుమార్‌, సుశాంత్‌రెడ్డి, ఇన్‌చార్జి మాలతి తదితరులు పాల్గొన్నారు.

అపెక్స్‌ విద్యార్థుల ముందంజ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలో ని అపెక్స్‌ పాఠశాల విద్యార్థులు ముందంజలో నిలిచారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు శ్రేష్ట 588, సాయి అక్షర 583, మహవీష్‌ మనాల్‌ 581 మార్కులు సాధించగా పాఠశాలలో మొత్తం 100శాతం ఫలితాలు సాధించినట్లు పాఠశాల యాజమాన్యం శివజ్యోతి తెలిపారు.

‘పంచవంటి’ విజయదుందుభీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఎస్సె స్సీ ఫలితాల్లో జిల్లాకేంద్రంలోని పంచవటి విద్యాల య విద్యార్థులు విజయదుందుభీ మోగించారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు అజ్రాతబస్సుమ్‌ 592, అనన్యశ్రేష్ట 590, ప్రణీత్‌రెడ్డి 588, అభిరామ్‌ 588 మార్కులతో రాష్ట్రస్థాయి ప్రతిభ కనబర్చారు. వీరితోపాటు మ్యాథ్స్‌ లో 33, తెలుగులో 12, సోషల్‌లో 8మంది విద్యార్థులు 100కు 100మార్కులు సాధించారు. 550కిపైగా 146మంది విద్యార్థులు సాధించారు. ఈ మేరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్‌ అనితారెడ్డి, చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ వెంకటరమణ అభినందించారు.

ఎస్సెస్సీ ఫలితాల్లో శ్రీ‘ప్రతిభ’

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని శ్రీప్రతిభ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ఈ మేరకు పాఠశాల విద్యార్థులు అనీకఅయిమన్‌ 588సాధించి రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చింది. మొత్తం 71మంది విద్యార్థులు ఉత్తీర్ణులుకాగా 100శాతం ఫలితాలు సాధించారు. 49మంది విద్యార్థులకు 500లకుపైగా మార్కు లు సాధించారు. ఇంతటి విజయానికి కారణమైన విద్యార్థుల తల్లిదండ్రుల కు పాఠశాల యాజమా న్యం కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో ఆనంద్‌రెడ్డి, కమలాకర్‌, వెంకటరమణ, శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ హారిక పాల్గొన్నారు.

సత్తాచాటిన ‘లిటిల్‌ స్కాలర్‌’

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని లిటిల్‌ స్కాలర్‌ పాఠశాల విద్యార్థులు సత్తా చాటా రు. ఈ మేరకు పాఠశాల విద్యార్థు లు శ్రీవర్షిణి 576, జుబియా గౌహర్‌ 564, ఫర్హా అహ్లమ్‌ 557, అబూబాకర్‌ సిద్ధికి 557 మార్కులు సాధించడంతోపాటు పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణతను సా ధించినట్లు కరస్పాడెంట్‌ అరుంధతిరాయ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement