జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): వచ్చే మే నెలలో ఎండలు తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో జిల్లా లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేకాధికారులు, ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో మండల స్థా యిలో తరచూ సమావేశాలు నిర్వహించి నీటి సరఫరా సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కొరతతో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న అన్ని నీటి వనరులను పర్యవేక్షించి నిరంతర సరఫరా చేయాలని సూచించారు. నీటి వనరులు లేని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, గతే డాది నీటి ఎద్దడి ఎదుర్కొన్న గ్రామాలను గుర్తించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కొత్త బోర్ల అనుమతులు కేవలం అత్యవసర, నీటి అవకాశం ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఇస్తామన్నారు.
● సమావేశానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. మండలాల ప్రత్యేకాధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ జయాబాయి తదితరులు పాల్గొన్నారు.


