ఆరోగ్య శాఖ విస్తృత కార్యక్రమాలు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్య శాఖ విస్తృత కార్యక్రమాలు

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

పాలమూరు: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలోని క్షయ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని మోతీనగర్‌ అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 119 మందికి ఎక్స్‌రే, 21 మందికి తెమడ పరీక్షలు చేయగా.. నలుగురికి టీబీ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అదేవిధంగా జిల్లాలోని పలు పీహెచ్‌సీల పరిధిలో ఉపాధి హామీ కూలీలకు ఓఆర్‌ఎస్‌ పాకెట్లు పంపిణీ చేశారు. మిడ్జిల్‌ పీహెచ్‌సీ పరిధిలో 595 ఇళ్లు సందర్శించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. నీటి నిల్వలలో లార్వాలను గుర్తించి నిర్మూలన చర్యలు చేపట్టారు. 19 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి రక్త పరీక్షలు చేసి మందులు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement