12 రోజులుగా పడిగాపులు | - | Sakshi
Sakshi News home page

12 రోజులుగా పడిగాపులు

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

డ్చర్ల పత్తి మార్కెట్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి 140 బస్తాల మొక్కజొన్న తీసుకువచ్చాను. కొనుగోలు చేయకపోవడంతో కుప్ప వద్దే 12 రోజుల నుంచి పడిగాపులు కాస్తున్నా. పొలం దగ్గర వరిచేను కోసి కుప్ప వేశాను. ఇంటి వద్ద గొర్లను కాసే దిక్కులేదు. ఇక్కడేమో కొనుగోలు చేయడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.

– నారాయణ, రైతు, మద్దిగట్ల

కలెక్టరే న్యాయం చేయాలి..

మొక్కజొన్న అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాం. 25 రోజులుగా ఆరబెట్టడం, కుప్పగట్టడం, తూర్పార బట్టడమే సరిపోయింది. ప్రతిరోజు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చిపోయే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై కాలుకు తీవ్ర గాయమైంది. అయినా కొనుగోలు చేయడం లేదు. వర్షం వచ్చే పరిస్థితి ఉన్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ మాకు న్యాయం చేయాలి.

– హిర్మన్‌, రైతు, మొరంబాయితండా

గోస పడుతున్నాం..

నేక కష్టనష్టాలకు గురై పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకుపోయేందుకు పడుతున్న గోస అంతా ఇంతా కాదు. తిండి.. తిప్పలు మాని నెలరోజులుగా కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నా.. పట్టించుకునే దిక్కులేదు. రేపు.. మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంత అన్యాయం ఎప్పుడూ చూడలే. అధికారులు, పాలకులు ఏం చేస్తున్నారో అర్థమైతలేదు. – టోక్య, రైతు, గోప్లాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement