కందనూలులో భారీ వర్షం | - | Sakshi
Sakshi News home page

కందనూలులో భారీ వర్షం

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం గంటపాటు కురిసింది. ప్రధాన రోడ్డుపైకి వర్షం నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. చెట్లు నేలకొరిగిగాయి. విద్యుత్‌ పూర్తిగా గంటపాటు నిలిచిపోయింది. నెల్లికొండ మార్కెట్‌ యార్డులో కురిసిన వర్షానికి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మార్కెట్‌లో ఆరబోసిన మొక్కజొన్న రాశులు తడిసిపోయాయి. వారంరోజుల నుంచి రైతులు మార్కెట్‌కి అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం ఒక్కసారి వర్షం రావడంతో తడవకుండా ఉండడానికి ప్రయత్నం చేసినా భారీ వర్షానికి చేసేదిలేక నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. ఆకాల వర్షం రైతన్నలను నిండా ముంచిందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి వేగవంతంగా కొనుగోలు ప్రక్రియను చేపట్టాలని రైతన్నలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement