రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Apr 29 2026 7:54 AM | Updated on Apr 29 2026 7:54 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: చించోళి బైపాస్‌ రోడ్డులో మంగళవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందగా.. ఐదుగురికి గాయాలయ్యాయి. వన్‌టౌన్‌ ఎస్‌ఐ శీనయ్య కథనం ప్రకారం.. వీరన్నపేట ఎర్రమన్నుగుట్ట సమీపంలోని చించోళి బైపాస్‌ రోడ్డుపై మంగళవారం సాయంత్రం నగరంలోని మోనప్పగుట్టకు చెందిన వేణుగోపాల్‌తోపాటు నిరంజన్‌, శషాంక్‌ ముగ్గురు కలిసి అయిల్‌ డబ్బాలు తీసుకుని బొలేరోలో వస్తుండగా.. ఎదురుగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న తాహేర్‌(40) దుర్మరణం చెందగా కారులో ఉన్న ఇమ్రాన్‌, రెహాన్‌కు తీవ్ర గాయాలు కాగా, హైదరాబాద్‌కు తరలించారు. బొలేరోలో ఉన్న వేణుగోపాల్‌, నిరంజన్‌, శషాంక్‌ను జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

● చించోళి బైపాస్‌ రోడ్డుపై ఎర్రమన్నుగుట్ట సమీపంలో కొంత మేర మలుపు ఉండడంతో ముందు వచ్చే వాహనం దగ్గరకు వెళ్లే వరకు కన్పించదు. దీంతో కారు చాలా వేగంగా ఉండడంతో అదుపు కాకపోవడంతో ఎదురుగా వచ్చిన వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారు స్టీరింగ్‌ ఊడిపోయి బయటపడింది. అయితే వీరన్నపేట సమీపంలో బైపాస్‌ రోడ్డుపై అధికంగా దాబాలు ఉండటంతో మద్యం మత్తులో తరచూ ప్రమాదాలకు చోటుచేసుకుంటున్న తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement