లీగ్‌ మ్యాచుల్లో హోరాహోరీ | - | Sakshi
Sakshi News home page

లీగ్‌ మ్యాచుల్లో హోరాహోరీ

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

జడ్చర్ల టౌన్‌: జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ మైదానాల్లో జరుగుతున్న ఎస్‌జీఎఫ్‌ 69వ జాతీయ అండర్‌ 17 బాలుర క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో రెండో రోజు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. మొత్తం 5 మైదానాల్లో జరిగిన మ్యాచుల్లో ఆయా రాష్ట్రాల జట్లు ప్రతిభ కనబర్చి విజయాలు నమోదు చేశాయి.

జడ్చర్ల మినీ స్టేడియంలో..

జడ్చర్ల మినీ స్టేడియంలో పంజాబ్‌– గుజరాత్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆల్‌ రౌండ్‌ ప్రతిభ కనబర్చిన పంజాబ్‌ విజయం సాధించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. పంజాబ్‌ జట్టులో అరవింద్‌ 3 వికెట్లు తీయగా, గుజరాత్‌ జట్టులో పృథ్వీ పటేల్‌ 28 పరుగులు చేసి టాపర్‌గా నిలిచాడు. 68 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కేవలం 4 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది. జట్టులో రన్వీర్‌ 14 బంతుల్లో 45 పరుగులు చేశాడు.

జమ్మూకశ్మీర్‌ విజయం

మినీ స్టేడియంలోనే జమ్మూకశ్మీర్‌– సీబీఎస్‌ఈ డబ్ల్యూఎస్‌ఓ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్‌ విజయం సాధించింది. టాస్‌ గెలిచిన సీబీఎస్‌ఈ డబ్ల్యూఎస్‌ఓ జట్టు బౌలింగ్‌ ఎంచుకోగా బ్యాటింగ్‌కు దిగిన జమ్మూకశ్మీర్‌ 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసింది. మూసేబ్‌ 20 బంతుల్లో 58 పరుగులు, హర్ష్‌ 26 బంతుల్లో 44 పరుగులు చేయటంతో అధిక స్కోరు చేయగలిగారు. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీబీఎస్‌ఈ డబ్ల్యూఎస్‌ఓ జట్టు లక్ష్య చేధనలో డీలా పడింది. 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. బౌలింగ్‌లో పైస్‌, సుబబ్‌, ప్రదీప్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. టోర్నీలోనే అఽత్యధిక స్కోరు జమ్మూకశ్మీర్‌ జట్టు నమోదు చేయటం గమనార్హం.

49 పరుగుల తేడాతో బిహార్‌ విజయం

స్వామినారాయణ గురుకుల మైదానంలో పాండిచ్చేరి– బిహార్‌ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో బిహార్‌ 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బిహార్‌ నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. బౌలింగ్‌లో పృథ్వీరాజ్‌ 2 వికెట్లు తీయగా రిషివర్మ, దివాకర్‌, టోనిలు ఒక్కో వికెట్‌ తీశారు. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాండిచ్చేరి 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేయగలిగింది. బిహార్‌ బౌలర్‌ ఓంకార్‌ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

మహబూబ్‌నగర్‌ ఎండీసీఏ మైదానంలో..

మహబూబ్‌నగర్‌ ఎండీసీఏ మైదానంలో జార్ఖండ్‌– చత్తీస్‌ఘడ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్‌ విజయం సాధించింది. టాస్‌ గెలిచిన జార్ఖండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ చేపట్టిన చత్తీస్‌ఘడ్‌ 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆకాష్‌ 45 పరుగులు చేయగా హర్షిత్‌ 3 వికెట్లు తీశాడు. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్‌ జట్టు 3 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యం సాదించింది.

మహబూబ్‌నగర్‌ బీఎస్‌ఆర్‌ మైదానంలో ఢిల్లీ– సీబీఎస్‌ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. సీబీఎస్‌ఈ జట్టు టాస్‌ గెలిచి ఢిల్లీకి బ్యాటింగ్‌ ఇచ్చింది. ఢిల్లీ జట్లు 3 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. జట్టులో ఆరుష్‌ 38 బంతుల్లో 66 పరుగులు చేశాడు. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీబీఎస్‌ఈ జట్టు 7 వికెట్లు కోల్పోయి 80 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో కుశాల్‌ 41 పరులుగు చేశాడు. దీంతో 65 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది.

ఐపీఎస్‌సీఈ విజయం

స్వామినారాయణ్‌ గురుకుల మైదానంలోనే కర్ణాటక– ఐపీఎస్‌సీఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐపీఎస్‌సీఈ జట్టు విజయం పొందింది. టాస్‌ గెలిచిన కర్ణాటక జట్టు 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. జట్టులో శ్రీజేష్‌ 24 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐపీఎస్‌సీఈ జట్టు చివరి బంతి మిగిలి ఉండగానే 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. జట్టులో ధృవ్‌సోకిన్‌ 19 బంతుల్లో 42 పరుగులు, శ్లోక్‌వర 25 బంతుల్లో 42 పరుగులు చేసి జట్టు విజయానికి కారణమయ్యారు.

బీఎస్‌ఆర్‌ మైదానంలో..

కొనసాగుతున్న

ఎస్‌జీఎఫ్‌ జాతీయ క్రికెట్‌ టోర్నీ

Advertisement
 
Advertisement
Advertisement