తెలంగాణ జట్టు ఆడిన రెండో మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మహబూబ్‌నగర్ ఎండీసీఏ మైదానంలో చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన చండీఘడ్ మొదట బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. జట్టులో ఆహన్ 47 పరుగులు, సూరజ్ 42 పరుగులు చేశారు. సాయి తనిష్క్ 2 వికెట్లు తీశారు. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తెలంగాణ జట్టు మరో 4 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. షాన్ విన్సెంట్ 41 బంతుల్లో 76 పరుగులు చేయగా హర్షిత్ 33 పరుగులు చేసి విజయంలో కీలకం అయ్యారు. బౌలింగ్‌లో అర్వదీప్ 2 వికెట్లు తీశాడు.
● ఉత్తరప్రదేశ్– డీఎన్‌హెచ్‌డీడీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న యూపీ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. జట్టులో ఆయుష్‌మాన్ 43 బంతుల్లో 98 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి.. త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన డీఎన్‌హెచ్‌డీడీ జట్టు 76పరుగులకే ఆలౌట్ అయి 134 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.
● ఢిల్లీ– ఎన్‌వీఎస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగా జట్టులో రాహుల్ 21 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్‌వీఎస్ జట్టు 45 పరుగులకే కుప్పకూలింది. హర్షిల్ 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
● హర్యానా– మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్‌లో హర్యానా టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. 109 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్ చేపట్టిన మహారాష్ట్ర 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది. హర్యానా జట్టులో నకుల్, ప్రియాంషు చెరో మూడు వికెట్లు తీసి జట్టు విజయానికి దోహదపడ్డారు.


