ఉప్పొంగిన శివభక్తి | - | Sakshi
Sakshi News home page

ఉప్పొంగిన శివభక్తి

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

నవాబుపేట: ఓం నమఃశివాయ.. ఓం వీరభద్రాయ అంటూ నిప్పు కణికలపై నడిచి భక్తి పారవశ్యంతో పొంగిపొర్లారు భక్తులు. మండల పరిధిలోని లోకిరేవు వీరభద్రస్వామి దేవాలయంలో ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా సోమవారం జరిగిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేవాలయంలో అగ్నిగుండంలో భక్తులు నడిచి తమ భక్తిని చాటుకున్నారు. నాడు దక్షయజ్ఞం వీరభద్రుడు భగ్నం సందర్భంగా అగ్నిలో దూకి వీరంగం సృష్టించిన నేపథ్యంలో స్వామి దేవాలయాల్లో అగ్ని గుండాలు నిర్వహిస్తారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి శివ భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే గ్రామంలో పురవీధుల గుండా ఏర్పాటు చేసిన రథోత్సవం అందరిని ఆకట్టుకుంది. అనంతరం గురుస్వాములకు సత్కారం చేసి రథయాత్రలో ఊరేగించారు. కార్యక్రమంలో పూజారి లింగయ్య, వీరభద్రయ్యస్వామి, అర్చక సంఘం రాష్ట్ర నాయకుడు వీరన్న, యాదయ్య, మాజీ సర్పంచ్‌లు వెంకటేష్‌, సత్యం, కృష్ణయ్య, నర్సింహచారి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

అగ్నిగుండంలో నడిచిన భక్తులు

Advertisement
 
Advertisement
Advertisement