మిడ్జిల్: మండల కేంద్రం సమీపంలో సోమవారం ప్రమాదవశాత్తు మొక్కజొన్న పంటకు నిప్పు తగులడంతో దాదాపు 6ఎకరాలలో సాగు చేసిన పంట కాలీ బూడిదైందని కౌలు రైతులు రాములు, రవి తెలిపారు. వారు మిడ్జిల్ సమీపంలో దాదాపు 8ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న సాగు చేశారు. పంట చేతికి వచ్చినా కొనుగోలు సకాలంలో జరుగకపోవడంతో మరోవారం రోజుల తర్వాత పంటను కోద్దామనుకునేలోగా సోమవారం సాయంత్రం పంటకు నిప్పంటుకుంది. మంటలు వ్యాప్తించడంతో చుట్టుపక్కలవారు గమి నించి సమాచారం ఇచ్చారు. కానీ అప్పటికే 80 శాతం పంట కాలిపోవడంతో మంటలను అదుపు చేయగా.. రెండు ఎకరాల్లో మాత్రమే మి గిలిందని దాదాపు రూ.4నుంచి 5లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


